Home

»

Latest News

సత్యానికి ఎల్లప్పుడూ ఒక స్వరం కావాలి: ఆసక్తికరంగా మారిన రెజీనా తాజా న్యూస్!

Nov 10, 2026 11:37AM


రెజీనా ప్రస్తుతం 'మహాశక్తీ'తో థియేటర్స్ లో సందడి చేస్తూ ఉంది. ఆ చిత్రంలో 'భైరా' అనే ఒక శక్తివంతమైన మంత్రగత్తె  క్యారక్టర్ లో సూపర్ పెర్ఫార్మ్ చేసి పాన్ ఇండియా మేకర్స్ తన వైపు చూసేలా చేసుకుంది. ఇప్పుడు ఆమె నుంచి రాబోతున్న కొత్త మూవీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా, సినీ సర్కిల్స్ కి ఫ్రెష్ నెస్ ని తెచ్చాయి.  


ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా చేతులు కలిపి ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టాయి. రెజీనా కీ రోల్. లెజండ్రీ యాక్టర్ నాజర్, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. విశాల్ వెంకట్ దర్శకుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి 'ఆర్‌ఎక్స్‌' అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు.

తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన పోస్టర్‌లో నటి రెజీనా ట్రెడిషనల్ చీరకట్టులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఒక రద్దీగా ఉండే రైలులో ప్రయాణికుల మధ్య ఆమె నిలబడి చాలా సీరియస్‌గా, ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్న ఆమె లుక్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. 

ఇది కూడా చదవండి: కోట శ్రీనివాసరావుని గొప్ప నటుడిని చేసింది అదే!

ముఖ్యంగా ఆ పోస్టర్‌పై ముద్రించిన ''సత్యానికి ఎల్లప్పుడూ ఒక స్వరం కావాలి'' అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్ సినిమా కథ ఏ స్థాయిలో ఉండబోతుందనే దానిపై పెద్ద చర్చకే తెరలేపింది.ఇది కేవలం సాధారణ వినోదాత్మక చిత్రం మాత్రమే కాదని, సమాజంలోని కొన్ని కీలక సత్యాలను వెలికితీసే ఒక బహుభాషా (Multi-lingual) సంచలన చిత్రంగా రూపుదిద్దుకుంటోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ముగింపు దశలో (Final stages) ఉందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రానుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. లోకేశ్ కనగరాజ్, మైత్రి  నిర్మాణ శైలి, విశాల్ వెంకట్ టేకింగ్, రెజీనా అసాధారణ అభినయం కలగలిసి వస్తున్న ఈ 'ఆర్‌ఎక్స్‌' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి మరి.

మీకు నచ్చవచ్చు : రేణు దేశాయ్ సంచలన పోస్ట్!
మీకు నచ్చవచ్చు:రామాయణ వరల్డ్ రికార్డు!

[Regina RX Movie Title Look, Regina new movie, RX movie title look, Lokesh Kanagaraj production, Mythri Movie Makers, Vishal Venkat, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com