Home

»

Latest News

రామ్ గోపాల వర్మ కొత్త చిత్రం 'రెడ్డి గారు పోయారు'

Mar 19, 2011 4:14PM

Rma gopal varma stills, Rma gopal varma images, Rma gopal varma pics, Rma gopal varma wallpapers, Rma gopal varma pictures, Rma gopal varma working stillsరామ్ గోపాల వర్మ కొత్త చిత్రం "రెడ్డి గారు పోయారు" అనే పేరుతో ప్రారంభించబోతున్నాడు. సంచలనాలతో, వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తాను కొత్తగా రాజకీయాల మీద తీయబోయే చిత్రానికి ఒక విభిన్నమైన పేరుని ఎన్నుకొన్నారు. అదే "రెడ్డి గారు పోయారు. అంటే ఏ రెడ్డి గారు పోయారు...? ఆ రెడ్డిగారు ఎక్కడికి పోయారు...? రెడ్డిగారు ఢిల్లీకి పోయారా...? లేకపోతే ఏకంగా పైకే పోయారా...? అన్నది ఇంకా తెలియలేదు.

 

అయితే ఈ పేరు కూడా రామ్ గోపాల వర్మ ఇంకా కచ్చితంగా అనుకోవటం లేదు. ఈ పేరే గనక వర్మ తన చిత్రానికి పెడితే ఆర్థికంగా, సామాజికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం అతని మీద నిప్పులు చెరగటం ఖాయం. మొన్న రక్తచరిత్ర అని ఫ్యాక్షన్ మీద...ఆ తర్వాత అప్పల్రాజని సినిమా పరిశ్రమలోని కొందరి మీద, మీడియా మీద వ్యంగాస్త్రాలు కురిపించాడు.

 

బెజవాడ రౌడీలు అని విజయవాడ మీద తన బాణం ఎక్కుపెట్టాడు. ఇప్పుడు రాజకీయాల మీద, అక్కడ చక్రం తిప్పే రెడ్డి సామాజిక వర్గం మీద తన బాణం ఎక్కుపెడుతున్నాడు రామ్ గోపాల వర్మ. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లోని సమకాలీన రాజకీయాల్లో ఉండే కుట్రల వెనకాల ఉండే కుట్రల మీద వర్మ ఎక్కుపెడుతున్న బ్రహ్మాస్త్రం అనుకోవాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com