రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్వల్ప అస్వస్థత..!
on May 17, 2016
రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు నిన్న స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయన హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో చేరారు. శ్వాస తీసుకోవడంలో కృష్ణం రాజుకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని, సీనియర్ డాక్టర్ సోమరాజు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. అందరికీ చేదోడు వాదోడుగా ఉండే కృష్ణం రాజుకు ఆరోగ్యం బాలేదని తెలియగానే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. హీరో ప్రభాస్ కూడా పెదనాన్న దగ్గరే ఉండి, అన్నీ చూసుకుంటున్నట్లు సమాచారం. భయపడాల్సిందేమీ లేదని, కృష్ణంరాజు ఆరోగ్యం బాగుందని, సమస్య చాలా చిన్నదని వైద్యులు చెబుతున్నారు.