Home

»

Latest News

Razor Movie Review: రేజర్ మూవీ రివ్యూ

May 08, 2026

 


సినిమా పేరు: రేజర్
న‌టీన‌టులు: రవిబాబు, తనీష్, ఇనయ సుల్తానా,  బెనర్జీ  తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: చరణ్ మాధవనేని 
ఎడిటింగ్: రామకృష్ణ 
మ్యూజిక్: ఎస్ ఎస్ రాజేష్
నిర్మాత‌: రవిబాబు 
సమర్పణ:  సురేష్ ప్రొడక్షన్స్  
బ్యానర్  :ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ 
స్క్రీన్ ప్లే: సత్యానంద్
రచన,దర్శకత్వం:రవిబాబు 
రిలీజ్ డేట్ : మే 8 , 2026 

విభిన్న చిత్రాల హీరో, దర్శకుడు రవిబాబు నుంచి కొంతకాలంగా  సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మెరుపులు లేవు. ఈ రోజు 'రేజర్' తో టేక్ ఆఫ్ అయ్యాడు. పైగా అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.


కథ
రుద్ర ప్రతాప్( రవిబాబు) పెట్ డాగ్స్ ని క్లీన్ చేసే సంస్థని రన్ చేస్తుంటాడు. అను, కృష్ణ, రాహుల్ అనే ముగ్గురు రుద్ర టీం. విష్ణు(తనీష్) కూతురు పేరు తేజు. ఆరు సంవత్సరాల పాప. ఎన్నో కబ్జాలు, హత్యలు చేసిన కరుడుగట్టిన నేరచరిత్ర కలిగిన కనకరాజు హోమ్ మినిస్టర్ స్థాయినుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహుర్తాన్ని సిద్ధం చేసుకుంటాడు. కానీ తేజు అడ్డుగా ఉంటుంది. దీంతో తేజుని చంపడానికి అత్యంత   ప్రమాదకరమైన మనుషులని పంపినా  వాళ్ళందర్నీ రుద్ర నిర్దాక్షణ్యంగా చంపుతుంటాడు. తేజు కోసం రుద్ర ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నాడు? కనకరాజు ముఖ్యమంత్రి కాకుండా ఉండటానికి  తేజు ఎందుకు అడ్డు? తేజు కథ ఏంటి? తేజుని  రుద్ర చివరి వరకు కాపాడాడా?  రుద్ర నిజంగానే పెట్ డాగ్స్ ని క్లీన్ చేసే సంస్థ అధినేతేనా? లేక అతని కథ ఏమైనా ఉందా?  అను, కృష్ణ, రాహుల్ లు ఎవరు? చివరకి రేజర్ కథ ఎలా ముగిసింది అనేదే కథ

 ఎనాలసిస్ 
రవిబాబు సెల్యులాయిడ్ పై తన డైరెక్షన్, యాక్టింగ్ తో రఫ్ఫాడించాడు. ఇలాంటి కథలకి టెక్నాలజీని జోడించి తెరకెక్కించాలంటే మేకర్స్ కి చాలా కష్టం. ఎన్నో లాజిక్ లు  మెదులుతూ ఉంటాయి. అలాంటిది ప్రతి లాజిక్ ని దాటుకుంటూ లాజిక్ నే కధా వస్తువుగా మలుచుకున్న తీరు హాట్స్ ఆఫ్. ముఖ్యంగా ఈ విషయంలో లెజండ్రీ స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారి అనుభవం కలిసొచ్చింది. ఫస్ట్  హాఫ్ చూసుకుంటే సినిమా స్టార్టింగ్ సన్నివేశమే కథ యొక్క ఉద్దేశ్యం చెప్పారు. దీంతో కథలోకి లీనమవుతాం. రుద్ర ఇంట్రడక్షన్ సీన్ తో పాటు విష్ణు ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా తేజు, రుద్ర సీన్స్ తో పాటు ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత పోరాట సన్నివేశాలు రావడం, రుద్ర టీం అండ్ తేజు మధ్య వచ్చే సీన్స్ వాటి పర్పస్ అయితే సూపర్. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది.

సెకండ్ హాఫ్ లో వచ్చిన ఆశ్చర్యకరమైన కథ థ్రిల్ కి గురి చేస్తుంది. సదరు సన్నివేశాలతో ఎమోషనల్ కి కూడా లోనవుతాం. దీంతో ఫస్ట్ హాఫ్ లో రుద్ర ఎందుకు తేజు విషయంలో పోరాటం చేస్తున్నాడు. సంఘ విద్రోహ శక్తులని ఊచకోత ఎందుకు కోస్తున్నాడో అర్ధమవుతుంది. స్టార్టింగ్ లో ఉన్న టెంపో చివరి వరకు అలాగే కొనసాగింది. పిజి హాస్టల్ సీన్ అయితే ఎక్స్ లెంట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా రేజర్ కి పెద్ద బలాన్ని ఇచ్చాయి.  కాకపోతే యాక్షన్ సీక్వెన్స్  శృతి మించి ఉన్నాయి

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
రుద్రగా రవిబాబు రెండు పార్శ్యాలు దాగి ఉన్న క్యారక్టర్ లో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన భార్య, కూతురు విషయంలో జరిగిన అన్యాయానికి రవిబాబు ప్రదర్శించిన పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఇరగదీసాడు. తేజుగా చేసిన పాప కూడా తన పెర్ఫార్మ్ గురించి అందరు మాట్లాడుకునేలా మెస్మరైజ్ చేసే పడేసింది. రుద్ర టీమ్ గా చేసిన వాళ్ళు, హోమ్ మినిస్టర్ కనకరాజు, అతని కొడుకుగా చేసిన సింహ, ఆర్మీ ఆఫీసర్ గా చేసిన బెనర్జీ, తనీష్ అండ్ వైఫ్ ఇలా చెప్పుకుంటు పోతే ప్రతి ఒక్కరు రేజర్ కోసమే పుట్టినట్టుగా తమ క్యారక్టర్ కి ప్రాణం పోశారు. ఆఖరికి విలన్ బాచ్ లో వాళ్ళు కూడా. రవిబాబు దర్శకుడిగా, రచయితగా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్  అతి పెద్ద ఎసెట్ .

బలాలు
1 .స్టోరీ  
2 .స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ 
3 . రవిబాబుతో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్ 
4 . ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
5 .ప్రీ క్లైమాక్స్ 
6 . క్లైమాక్స్ 

బలహీనతలు
1 .కొన్ని యాక్షన్ సీక్వెన్స్ శృతి మించడం 


 చివరిగా చెప్పుకోవాలంటే కథ పాయింట్ చిన్నదే అయినా హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో రేజర్ తెరకెక్కింది. 

రేటింగ్ : 2.5 /5                                                                                                          అరుణాచలం 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com