Home

»

Latest News

రవితేజ వీర సెన్సారులో

May 17, 2011 8:40AM

రవితేజ "వీర" సెన్సారులో ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్క్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"వీర". రవితేజ "వీర" చిత్రానికి తమన్ సాయి సంగీతాన్నందించారు. రవితేజ "వీర" సినిమాలో సీనియర్ యన్ టి ఆర్ హీరోగా నటించిన "డ్రైవర్ రాముడు" చిత్రంలోని "మావిళ్ళ తోటకాడ నేనొస్తే" అనే పాటను రీమిక్స్ చేశారు.

రవితేజ "వీర" మూవీ ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూంది. రవితేజ "వీర" సినిమాలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూండగా, కాజల్ అగర్వాల్ కబడ్డీ చిట్టిగా పక్కా మాస్ పాత్రలో నటిస్తూంటే, తాప్సి సాప్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తుంది. ఈ రవితేజ "వీర" మూవీని మే 17 వ తేదీన సెన్సారుకి పంపారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. రవితేజ "వీర" సినిమా మే 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతూంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com