
మాస్ మహారాజా రవితేజ, సెన్సిటివ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి'. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ.. మాస్ మహారాజాని ఏ స్థాయిలో ప్రెజెంట్ చేయబోతున్నారో అని ప్రతీ సినిమా లవర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఆ కాంబో నుంచి ఊరమాస్ అప్‌డేట్ వచ్చేసింది. "కుటుంబమే లోకంగా బతికే ఒక వ్యక్తి, వారి కోసం ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో 'ఇరుముడి' మూవీ ట్రైలర్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 12న ఈ ట్రైలర్ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు.
ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ గమనిస్తే.. రవితేజ నోట్లో కత్తి పట్టుకుని ఉన్న ఆ సీరియస్ ఊరమాస్ లుక్ ఒకవైపు, అయ్యప్ప స్వామి భక్తుడిలా ఉన్న ఎమోషనల్ లుక్ మరోవైపు కనిపించి సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఓ మైండ్ బ్లోయింగ్ రైడ్ మనకి థియేటర్లలో లభించబోతోందని స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ అంచనాలను పెంచేయగా.. ఆగస్టు 12న రిలీజ్ అవుతున్న ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
Ravi Teja, Irumudi Trailer, Shiva Nirvana, Mythri Movie Makers






