
మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అంతేకాదు, మొదటి సోమవారం రోజున ఏకంగా 'బాహుబలి-2' తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
సాధారణంగా సోమవారం వచ్చిందంటే బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోతాయి. కానీ, ఇరుముడి క్రేజ్ ముందు ఆ సోమవారం సెంటిమెంట్ కూడా నిలబడలేదు. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా, మొదటి రోజు కలెక్షన్లకు చాలా దగ్గరగా ఈ సినిమా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఫస్ట్ మండే కలెక్షన్స్ విషయంలో తెలుగు చలనచిత్ర చరిత్రలోనే 'బాహుబలి 2' తర్వాత అతిపెద్ద డే-4 నంబర్స్ నమోదు చేసిన రీజినల్ ఫిల్మ్‌గా 'ఇరుముడి' నిలిచింది. అసలు వీకెండ్ ముగిసిన తర్వాత కూడా ఇంతటి అపూర్వమైన ఆక్యుపెన్సీ రావడం ట్రేడ్ వర్గాలనే షాక్‌కి గురిచేస్తోంది.
అసలు ఈ సినిమాకు ఇంతటి రెస్పాన్స్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మాస్ మహారాజా పెర్ఫార్మెన్స్, శివ నిర్వాణ అందించిన డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్, తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది. టాక్ పాజిటివ్‌గా రావడంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.
ఇక ఆన్‌లైన్ టికెట్ సేల్స్ చూస్తే మతిపోవాల్సిందే. ప్రముఖ టికెటింగ్ వేదికలైన బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లలో కలిపి ఏకంగా 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ చూడటం చాలా అరుదు.
నార్త్ అమెరికాలో కూడా ఇదివరకెన్నడూ లేని విధంగా దాదాపు 1మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిని నమోదు చేసింది.
బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ సాధించి, నాలుగో రోజుకే మైండ్ బ్లోయింగ్ లాభాలను తెచ్చిపెట్టింది.
డే-5 కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదుకావడంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Ravi Teja, Irumudi, Box Office






