
రవితేజ హీరోగా నటిస్తోన్న 70వ సినిమాకు 'రావణాసుర' అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ మూవీకి సుధీర్ వర్మ డైరెక్టర్. శుక్రవారం టైటిల్‌తో పాటు రవితేజ ఫస్ట్ లుక్‌ను కూడా ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశాడు. ఆ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన సుధీర్‌వర్మ, "రావణాసుర ఫస్ట్ లుక్‌ను ప్రెజెంట్ చేస్తున్నాం. 'ఆంజనేయులు' మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసినప్పట్నుంచీ రవితేజతో కలిసి పనిచేయడమనేది నా డ్రీమ్. ఇప్పుడది రియాలిటీ కాబోతోంది. దీన్ని సాధ్యం చేసిన శ్రీకాంత్ విస్సా (రైటర్), ఆర్‌టి టీమ్ వర్క్స్ (రవితేజ సొంత బ్యానర్), అభిషేక్ పిక్చర్స్‌కు నా సిన్సియర్ థాంక్స్" అని ట్వీట్ చేశాడు.
ఈ పోస్టర్‌లో సూట్ వేసుకొని ఠీవిగా రవితేజ కుర్చీలో కూర్చొని వుంటే, వెనుక ఆయనవే తొమ్మిది తలలు కనిపిస్తున్నాయి. పోస్టర్‌పై ఉన్న "Heroes Don't Exist" అనే కొటేషన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక డిపరెంట్ కాన్సెప్ట్‌తో సుధీర్ వర్మ ఈ మూవీని తీయనున్నట్లు ఊహించవచ్చు.
రవితేజ కూడా ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసి దానికి, "Excited about this one #Ravanasura " అనే క్యాప్షన్ పెట్టారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందే 'రావణాసుర' మూవీకి శ్రీకాంత్ విస్సా కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ హీరోగా 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' అనే సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. దీపావళి సందర్భంగా మొన్ననే 71వ సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'ను అనౌన్స్ చేశారు.






