
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)మెమొరీబిల్ హిట్ సాంగ్ 'స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన' పాట తెలుగు నాట మోగుతున్నంత కాలం రవీనా టాండన్ పేరు తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో మోగుతూనే ఉంటుంది. రీసెంట్ గా రవీనా టాండన్ ముంబైలో జరిగిన 'ఓహ్ మై డాగ్' సినిమా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది.
రెడ్ కార్పెట్ వద్ద నటి రవీనా టండన్, చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రూనో (Bruno) అనే పెంపుడు కుక్కతో కలిసి ఫోటోలకి భంగిమలు ఇచ్చారు. అయితే ఫోటో సెషన్ ముగిసిన తర్వాత ఆమె పైకి లేస్తున్న సమయంలో ఆ శునకం ఒక్కసారిగా బిగ్గరగా మొరుగుతూ రవీనా వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో శునకం నటిని కొరికేందుకు ప్రయత్నించినట్లు కనిపించడంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెంపుడు జంతువు నటి డ్రెస్ నూలు దారాన్ని (thread) తన నోటితో గట్టిగా పట్టుకుని లాగడం వల్ల నటి ప్రమాదంలో పడినట్లు కనిపించింది. కానీ, అంతటి ఆందోళనకర పరిస్థితుల్లో కూడా రవీనా టండన్ ఎంత మాత్రం భయపడకుండా, ఒత్తిడికి గురికాకుండా ఎంతో నిబ్బరంగా వ్యవహరించారు.
Also read: కొరియన్ కనకరాజుని ఎంత పని చేసావు స్వామి.. థమన్ ప్లస్ అయ్యాడా! లేదా!
ఆమె వెనక్కి తగ్గడానికి బదులుగా ముందుకు జరిగి ఆ శునకాన్ని ప్రేమగా నిమురుతూ దానిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. తదనంతరం ప్రదర్శన ముగిసి బయటకు వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడిన రవీనా టండన్, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, కుక్క తనని కొరకలేదని, కేవలం డ్రెస్ దారం మాత్రమే దాని నోటికి చిక్కుకుందని స్పష్టం చేశారు. రెడ్ కార్పెట్ వద్ద జరిగిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవీనా బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ హోదాలో అనేక చిత్రాల్లో చేసింది. రవీనా కూతురు రష తడా ని రీసెంట్ గా ఘట్టమనేని జై కృష్ణ తో కలిసి శ్రీనివాస మంగాపురంలో కనిపించిన విషయం తెలిసిందే.






