'శ్రీవల్లి'గా రష్మిక.. నెవర్ బిఫోర్ లుక్!
on Sep 29, 2021
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి రష్మిక ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
బుధవారం ఉదయం రష్మిక ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ మంగళవారం ప్రకటించింది. చెప్పినట్లుగానే ఈ ఉదయం 'పుష్ప' మూవీ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ లో వెల్లడించారు. గత చిత్రాలకు భిన్నంగా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. అద్దం ముందు కూర్చొని చెవులకి కమ్మలు పెట్టుకుంటున్నట్టుగా పోస్టర్ లో చూపించారు. అలాగే చీర, పూలు, గాజులు ఆమె అలంకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఎదురుగా పెట్టి ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.