‘పుష్ప, యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో పాన్ ఇండియా వైడ్‌గా నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం సరికొత్త నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ భామ, ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక పెద్ద నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గ్లామర్ రంగంలో ఉన్న హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వివాహానికి దూరంగా ఉంటారు. కానీ రష్మిక మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన ప్రియుడు, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని ఒక్కసారిగా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా అటు పర్సనల్ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంతో అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో పెళ్లి ఎదుగుదలకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తోంది.
గతేడాది వరుసగా ఐదు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్న రష్మిక, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్-2’తో అలరించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రణబాలి’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను రాబోయే సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు రష్మిక నటిస్తున్న మరో విభిన్నమైన యాక్షన్ చిత్రం ‘మైసా’. పూర్తిగా ట్రైబల్ బేస్డ్ యాక్షన్ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సైతం ఈ ఏడాది ఆఖరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కోసం చిత్రీకరించిన అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లో రష్మిక కనబరిచిన నటనకు చిత్ర యూనిట్ మొత్తం ఫిదా అయిపోయిందట.
సినిమా సినిమాకూ నటనలో వైవిధ్యం చూపిస్తూ దూసుకుపోతున్న రష్మికకు ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కోట్లాది రూపాయల బడ్జెట్ చిత్రాలతో క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రష్మిక ప్రస్తుతం కొత్త సినిమాలను అంగీకరించడంలో కాస్త వెనకడుగు వేస్తోందని, సినిమా కమిట్‌మెంట్ల విషయంలో దాదాపు ఫుల్ స్టాప్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు తాత్కాలికంగా లాంగ్ బ్రేక్ ఇవ్వబోతోందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ నేషనల్ క్రష్ కొత్త ప్రాజెక్ట్‌లకు కావాలనే విరామం ఇస్తోందా లేక పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితానికి మరికొంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందా అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కారణం ఏదైనప్పటికీ రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్‌ను మిస్ అవ్వకూడదని, ఆమె మరిన్ని చిత్రాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Rashmika Mandanna, Vijay Deverakonda, Ranabali




