Home

»

Latest News

Rashmika Mandanna: ఆ మూవీలో నటించడానికి భయపడింది వాస్తవం.. రష్మిక కీలక వ్యాఖ్యలు

Jun 6, 2026 10:30AM

 

రష్మిక దేవరకొండ పెళ్లి తర్వాత షాహిద్ కపూర్, కృతి సనన్ తో కలిసి సెల్యులాయిడ్ పై అడుగుపెడుతున్న మూవీ 'కాక్‌టెయిల్‌ 2'. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కి అభిమానులు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  'దియా' అనే సరికొత్త మోడ్రన్ క్యారెక్టర్‌లో రష్మిక  కనిపించనుంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో  రష్మిక  'కాక్‌టెయిల్‌ 2 ఒప్పుకోవడంపై ఆసక్తికరమైన విషయాలని వెల్లడి చేసింది.

 రష్మిక మాట్లాడుతూ  ఈ ప్రాజెక్టులో చెయ్యడం అంత సులభంగా జరగలేదు. ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేయడానికి నిజంగానే వెనుకాడాను. మనసులో ఒక రకమైన భయం వెంటాడింది. అందుకు కారణం ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో ఇంతటి అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఎప్పుడూ కనిపించలేదు. కెరీర్‌లో దాదాపు విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో కూడిన క్యారెక్టర్స్ చేసినప్పటికీ, ఈ రేంజ్ గ్లామరస్ అండ్ మోడ్రన్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ప్రారంభంలో ఈ చిత్రంలో నటించడం గురించి నేను తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అనే సందేహాలు వచ్చాయి.

కానీ, అదే సమయంలో ఒక నటిగా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల కూడా నన్ను ముందుకు నడిపింది. ఇంతక ముందెప్పుడూ ఇలాంటి సరికొత్త వెస్ట్రన్ అండ్ మోడ్రన్ లుక్ లో  కనిపించలేదు కాబట్టి, ఈ ఛాలెంజ్‌ను ఎలాగైనా స్వీకరించాలని డిసైడ్ అయ్యాను. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి 100 శాతం కష్టపడి దియా పాత్రకు ప్రాణం పోశాను. ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా భయాలన్నీ పటాపంచలైపోయాయి. నా నిర్ణయం సరైనదేనని నమ్మకం కుదిరిందని రష్మిక సంతోషం వ్యక్తం చేసింది .'కాక్‌టెయిల్‌ 2 రిలీజ్ డేట్ జూన్ 19 .

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com