Home

»

Latest News

RAPO23: 'వీర'గా రామ్ పోతినేని.. దర్శకుడిగా సంచలనం సృష్టించడం ఖాయమేనా?

May 15, 2026

'ఎనర్జిటిక్ స్టార్' రామ్ పోతినేని (Ram Pothineni) పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తన తదుపరి చిత్రం #RAPO23 గురించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కేవలం నటుడిగానే కాకుండా, ఈ సినిమాతో రామ్ ఒక కొత్త బాధ్యతను కూడా చేపట్టబోతుండటం విశేషం.

ఈ సినిమాకు రామ్ పోతినేని స్వయంగా కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. "కథల్లో ఇప్పటివరకు ఆయన ముఖాన్ని చూశారు, ఈ కథలో ఆయన స్వరాన్ని వింటారు" అంటూ టీమ్ ఇచ్చిన క్యాప్షన్ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక ఈ చిత్రానికి "The Story of a Lone Wolf" అనే ట్యాగ్‌లైన్ పెట్టడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller). రామ్ కెరీర్‌లో ఇదొక ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాధారణంగా రామ్ సినిమాలు అంటేనే హై-వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తాం. అయితే, ఈసారి రామ్ తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. 'RAPO23' చిత్రంలో "వీర" (VEERA) అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో రామ్ హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది. 

ఈ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్టర్‌లో రామ్ బ్యాక్ లుక్, ఆ హెయిర్ స్టైల్, లెదర్ జాకెట్ సినిమాలోని డార్క్ అండ్ ఇంటెన్స్ థీమ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.

ఇప్పటివరకు చాక్లెట్ బాయ్‌గా, మాస్ రాజాగా అలరించిన రామ్.. ఇప్పుడు దర్శకుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. 'వీర'గా ఆయన చేసే ఈ ప్రయాణం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com