Home

»

Latest News

Rao bahadur: రావు బహదూర్ కలెక్షన్స్ ఇవే.. అయ్యగారు దెబ్బకొట్టరా!

Jul 14, 2026 11:23AM

నటనని తన వృత్తిగా మలుచుకున్నందుకు సత్యదేవ్ తనని తాను చూసుకొని గర్వపడేలా చేసిన మూవీ 'రావు బహదూర్.  భార్య, కన్న కొడుకుపై అనుమానం పెంచుకునే వయసుకి మించిన పరిణితిని ప్రదర్శించే రామప్ప క్యారక్టర్ లో విజృంభించి పెర్ఫార్మ్ చేసాడు.  దీంతో మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 
 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.11 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ ఓపినింగ్ మూవీగా నిలిచింది.ముఖ్యంగా నైట్ షోలలో 38% పైగా థియేటర్ అక్యుపెన్సీ నమోదు కావడంతో సినిమాకి మంచి క్రేజ్ రావడంతో పాటు రెండో రోజు శనివారం నాడు కూడా తన హవా కొనసాగిస్తు 1.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.  అయితే, సోమవారం  వసూళ్లు క్రమంగా పడిపోయాయి. నాలగవ రోజున కేవలం  34 లక్షల నెట్ కలెక్షన్లు రాబట్టి ఆదివారం కంటే దాదాపు 66.7 శాతం నమోదు చేసింది. మొత్తంగా నాలుగు రోజులకు ఈ చిత్రం భారతదేశంలో రూ. 5.19 కోట్ల నెట్ (రూ. 5.91 కోట్ల గ్రాస్) కలెక్షన్లకు చేరుకుంది. విదేశాల్లో సాధించిన 3.00 కోట్లతో కలిపి నాలుగు రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు 8.91 కోట్లని  తాకాయి. ఎనిమిది రోజుల ముగింపు సమయానికి ఇండియాలో మొత్తం 5.68 కోట్ల నెట్ (రూ. 6.27 కోట్ల గ్రాస్) సాధించగా, ప్రాంతాల వారీగా తెలంగాణాలో  3.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2.78 కోట్లు, కర్ణాటకలో రూ. 73 లక్షలు నమోదు చేసింది.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌గా నిలిచేందుకు దాదాపు . 25 కోట్ల బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌ను దాటాల్సి ఉంది. కమర్షియల్ కలెక్షన్లు మందగించినప్పటికీ, ఈ చిత్రానికి గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. 


Also read: Chiranjeevi: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. చిరంజీవి వీడియో బయటపెట్టిన జానీ మాస్టర్ 


వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' ని  సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పించగా, చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. జూలై 3న రిలీజైన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో దూసుకుపోతున్న నవ యువ సామ్రాట్ అఖిల్ వన్ మాన్ షో లెనిన్ విజయం కూడా రావు బహదూర్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించిందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com