Home

»

Latest News

‘రణబాలి’ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ చీకటి నిజం తెలిసేది ఆరోజే.!

Aug 27, 2026 1:20PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారనుందని ఇటీవల న్యూస్ వినిపించింది. దానిని నిజం చేస్తూ, తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

‘రణబాలి’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. కండలు తిరిగిన దేహం, పొడవాటి జుట్టు, భుజాన కత్తితో విజయ్ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ పవర్ ఫుల్ లుక్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.. బాక్సాఫీస్ దగ్గర ఈసారి విధ్వంసం మామూలుగా ఉండదని.

19వ శతాబ్దంలో బ్రిటీష్ అణచివేతకు వ్యతిరేకంగా సాగిన యధార్థ పోరాటాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1854 నుండి 1878 మధ్య కాలంలో బ్రిటీష్ పాలకులు చేసిన ఆర్థిక దోపిడీ, మన నేలపై వచ్చిన తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగే యధార్థ సంఘటనల ఆధారిత కథ ఇది. మన చరిత్రలో దాయబడ్డ ఒక చీకటి అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నారు.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత బ్లాక్‌బస్టర్ జోడీ విజయ్- రష్మిక మూడోసారి జతకడుతున్నారు. రష్మిక ఈ సినిమాలో ‘జయమ్మ’ అనే పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక కాంబోలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. 

అంతేకాదు, ‘సర్ థియోడోర్ హెక్టర్’ అనే పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో హాలీవుడ్ స్టార్ యాక్టర్, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నాడు. విజయ్, ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్.

 

 

 

Ranabaali Release Date, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com