ట్విట్టర్ లో వర్మ.. పరారీలో నాగబాబు..!
on Jan 9, 2017
నాకు కొంచెం తిక్కుంది... ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెట్ అవుతుందో లేదో తెలియదు కానీ రాంగోపాల్ వర్మకు మాత్రం బాగా సెట్ అవుతుంది. మామూలుగానే తన ట్వీట్లతో అందరిని టార్గెట్ చేసే వర్మ.. తనపైనే సెటైర్లు వేస్తే ఊరుకుంటాడా..? ప్రస్తుతం అదే జరుగుతుంది. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు ఏదో పూనకం వచ్చినట్టు రాంగోపాల్ వర్మపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అంతే ఇక వర్మ తన ట్వీట్టర్ కు మంచి పని చెప్పాడు. నాగబాబుకు వరుస కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. అయితే వర్మ సంగతి తెలిసిందే కాబట్టి మెగా క్యాంప్ నుండి రివర్స్ లో ఒక్క ట్వీట్ కానీ... ఎవరి దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ కానీ రాలేదు. ఇక్కడితో సరిపెట్టడానికి అక్కడున్నది ఆషామాషీ వ్యక్తి కాదు రామ్గోపాల్ వర్మ. ఇక 'ముగించేశాను' అంటూనే మళ్ళీ ఉదయాన్నే మొదలెట్టారు. మళ్లీ సాయంత్రం 'తేలు పిల్ల కుట్టిందా.? వానపాము కుట్టిందా.?' అంటూ నాగబాబుపై తనదైన స్టయిల్లో మళ్ళీ ట్వీట్లేశారు. నో రెస్పాన్స్.. మరి ఎలాగైనా నాగబాబును బయటకు లాగడానికి వర్మ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? సినిమా విడుదలయ్యాక మళ్ళీ ఏదన్నా ఈవెంట్ పెడితే, దాన్ని వేదికగా చేసుకుని నాగబాబు కౌంటరిస్తాడా..? చూద్దాం ఏం జరుగుతుందో.