Home

»

Latest News

'ర్యాంబో'గా రచ్చ చేయనున్న 'ఉడుంబు'

Mar 18, 2022 2:53PM

మలయాళంలో మంచి విజయం సాధించిన 'ఉడుంబు' తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి 'ర్యాంబో' అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు 'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. రత్నాకరం అనిల్ రాజు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

హోలీ పండుగను పురస్కరించుకుని 'ర్యాంబో' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ర్యాంబోగా ఆశిష్ గాంధీ లుక్ ఆకట్టుకుంటోంది.   మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. 

సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరావు వర్క్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com