Home

»

Latest News

రంభ ఊర్వశి మేనక టీజర్: మ్యాజిక్ బుక్.. దేవకన్యల కోసం ముగ్గు.. కెవ్వు కేక కామెడీ.!

Aug 11, 2026 5:47PM

ఒకప్పుడు కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. కొన్నేళ్లుగా సీరియస్ కథలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రూట్ మార్చి మళ్ళీ కామెడీ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'రంభ ఊర్వశి మేనక'.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి చంద్రమోహన్ చింతాడ దర్శకుడు. ఈ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

ఒక మ్యాజిక్ బుక్, ప్రత్యేక పూజలతో దేవలోకం నుండి రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదకు రప్పించే రాజమండ్రి కుర్రాడి వినోదాత్మక ప్రయాణమే ఈ చిత్రం.

ఒక ఫ్యామిలీ మ్యాజిక్ బుక్ ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఆ బుక్ మీద కరెక్ట్‌గా ఒక ముగ్గు గీస్తే చాలు.. స్వర్గలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు నేరుగా భూమి మీదకు దిగివస్తారు. దాంతో హీరో 15 ఏళ్ల నుంచి ప్రతి రోజూ ముగ్గులు గీస్తూనే ఉంటాడు. చివరికి హీరో ప్రయత్నాలు ఫలించి.. నిజంగానే దేవకన్యలు భూమికి దిగి వస్తారు.

'నా పర్మిషన్ లేకుండా అదర్ ప్లానెట్స్‌కి వెళ్తారా?' అని ఇంద్రుడు దేవలోకంలో సీరియస్ అవుతుంటే... ఇక్కడ భూమి మీద ల్యాండ్ అయిన దేవకన్యలు మాత్రం, 'చాలా ఆకలిగా ఉంది... పులావ్ ఏమైనా తీసుకొస్తారా?' అని అడగడం టీజర్‌లో హైలైట్ సీన్ అని చెప్పాలి.

'రంభ ఊర్వశి మేనక' కోసం పూజ చేసిన హీరో.. తీరా వాళ్ళు వచ్చాక కంగారు పడిపోవడం ఆసక్తికరంగా ఉంది. ఇక టీజర్ చివరిలో అల్లు నరేష్ 'మేనక మాల' ధరించి.. 'స్వామి శరణం మేనక శరణం' అనడం మరో హైలైట్ అని చెప్పొచ్చు.

నరేష్ కెరీర్‌లో ఒక పూర్తిస్థాయి అవుట్ అండ్ అవుట్ హలేరియస్ ఫాంటసీ కామెడీ రాబోతోందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. మరి ఈ సినిమాతో నరేష్ థియేటర్లలో నవ్వులు పూయించి, కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.

 

 

Ramba Oorvasi Menaka Teaser, Allari Naresh, Telugu Comedy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com