Home

»

Latest News

రిలీజ్ కి ముందే రామాయణ సరికొత్త ప్రపంచ రికార్డు... ఆ ఐదులక్షల మందితో!

Jul 16, 2026 2:41PM

 

 

భారతీయ సినీ పరిశ్రమ గొప్పతనాన్ని వరల్డ్ సినీ యవనిక పై నిలబెట్టాలనే పట్టుదలతో తెరకెక్కుతున్న మూవీ రామాయణ(Ramayana).. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 8 న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ ని అయితే ప్రతి రామ భక్తుడు, సినీ ప్రేమికుడు డైలీ చూస్తూ రామాయణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. 


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన మునుపెన్నడూ చూడని ప్రమోషనల్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. కేవలం కమర్షియల్ పబ్లిసిటీకే పరిమితం కాకుండా, రామాయణంలోని పవిత్రమైన విలువలని ,సంస్కృతిని, మన పురాణాల గొప్పతనాన్ని నేటి తరం యువతకి, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా మేకర్స్ ఒక భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన ఔట్‌రీచ్ వీడియో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను కలుపుకుంటూ సాగిన ఈ మహత్తర ప్రచారంలో భాగంగా ఏకంగా 5 లక్షల మంది పాఠశాల విద్యార్థులని  భాగస్వామ్యం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విలక్షణమైన ప్రచార పద్ధతి ద్వారా చిన్న వయస్సు నుంచే పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు, మన సనాతన ధర్మం మరియు రామాయణ ఇతిహాసంపై ఆసక్తిని పెంచేలా కార్యక్రమాలను రూపొందించారు.మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో  సినిమా అనేది కేవలం వినోద సాధనమే కాదు, సమాజంపై, భావితరాలపై తీవ్ర ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం అని చిత్ర బృందం నిరూపిస్తోంది. ఒక భారీ బడ్జెట్ మూవీ ప్రమోషన్ల కోసం 5,00,000 మంది పాఠశాల స్థాయి విద్యార్థులని ఒకే తాటిపైకి తెచ్చి కనెక్ట్ చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.

Also read: రామ్ చరణ్ తో నయనతార.. అసలు ఆట మొదలు కాబోతుందా!

 రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మతల్లిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రైమ్ ఫోకస్ స్టూడియోతో కలిసి నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా యష్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. దర్శకుడు నితీష్ తివారీ రామాయణ కోసం దాదాపు 5 ఏళ్ల పాటు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల పైనే ఉండి రామాయణ తెరకెక్కించాడు. 

ramayana, ranbirkapoor, sai pallavi, yash, nitesh tiwari

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com