
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)గత చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈసారి 'వైల్డ్ యాక్షన్' డ్రామా తో వస్తున్నట్టుగా మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అర్ధమవుతుంది.
సదరు పోస్టర్ లో హ్యాండ్ రక్త సిక్తం అయినట్టుగా ఉండగా చేతిలో మైక్ పట్టుకుని ఉంది.ఆ హ్యాండ్ రామ్ దని వేరేగా చెప్పక్కర్లేదు. గెట్ రెడీ పీపుల్ అంటు రేపు బిగ్గెస్ట్ అప్ డేట్ అని చెప్పారు. రేపు రామ్ పోతినేని పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ ఈసారి కేవలం హీరోగానే కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నాడని సమాచారం. స్వయంగా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తునట్టుగా తెలుస్తోంది.
Also read: Tabu: మా ఇంట్లో అద్దం ఉంది.. మేటర్ మొత్తం మాకు తెలుసు
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ నుండి పక్కా మాస్ హిట్ కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉండబోతోందని టాక్. ఒకవేళ రామ్ నిజంగానే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటే, ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు కానుంది. ఇప్పటికే 'ఆంధ్ర కింగ్ తాలూకా' షూటింగ్ సమయంలో రామ్ క్రియేటివ్ మేకింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నారనే వార్తలు ఉన్నాయి, అది ఇప్పుడు ఆయన డైరెక్షన్ డెబ్యూకి పునాది వేసి ఉండవచ్చు.




