Home

»

Latest News

సర్కార్ పాత్రలో ప్రధాని మోడీ..!

Nov 22, 2016 2:26PM

రాజకీయాలతో..పాలనా విషయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాని నరేంద్రమోడీ సినిమాల్లో నటిస్తున్నారా..అని మీరు అనుకోవచ్చు కాని ఆ టైటిల్ వెనుక కథ వేరే ఉంది. దేశంలో అందరికి ట్విట్టర్ ఎకౌంట్ ఉన్నా..వాడేందుకు అంత టైం ఉండదు. కాని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మాత్రం ట్విట్టర్ వాడేందుకు బోల్డెంత టైం ఉంటుంది. తనకు నచ్చిన వారి మీదా..నచ్చని వారి మీద..తనకు నచ్చినట్లుగా ట్విట్టర్‌లో రాసుకుంటూ పోతాడు వర్మ. సినీతారలైనా..స్పోర్ట్స్ పర్సనాలిటీస్‌ అయినా ఇలా ఎవ్వరిని వదల్లేదు. తాజాగా వర్మ కన్ను ప్రధాని నరేంద్రమోడీపై పడింది. అంతే తన ఫోన్‌లో ట్విట్టర్ ఓపెన్ చేసి సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ బాడీకి మోడీ ఫేస్‌ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడు. అయితే మోడీపై ఎలాంటి కామెంట్ చేయలేదు..జస్ట్ ఫోటో పెట్టి వదిలేశాడంతే..ఇది చూశాకా వర్మ ఇంటెన్షన్ ఎంటో అర్థంకాక నెటిజన్లు జుట్టుపీక్కుంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com