విజయ్ మాల్యాకు క్యాలెండర్ గర్ల్స్ ను తాకట్టు పెట్టాలి
on Mar 12, 2016

విజయ్ మాల్యా 9 వేల కోట్లకు పైగా బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ అప్పును ఎలా తీర్చాలి అన్నదానిపై మాల్యాకు సలహా ఇస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. తను తెచ్చిన డబ్బులతో కాలెండర్ గర్ల్స్ ను తయారుచేసిన మాల్యా, అదే క్యాలెండర్ గర్ల్స్ ను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పును మాఫీ చేయమని అడగాలంటూ వర్మ ట్వీటాడు. బంగారు మెరుపులు చూపించి, బ్యాంకర్ల దగ్గర వజ్రాలు తీసుకున్నాడు మాల్యా అంటూ ఇన్ డైరెక్ట్ గా చురకలు కూడా వేశాడు. మాల్యాకు అన్ని వేల కోట్ల రుణాలు రావడం వెనుక దీపికా పడుకోణె, నర్గీస్ ఫక్రీ, ఇషా గుప్తాల కాంట్రిబ్యూషన్ ఉందంటూ సెటైర్లు వేశాడు వర్మ. ఈ పాటికే మాల్యా వారికి కూడా ఈ ట్వీట్లు చేరి ఉంటాయి. ఫారిన్లో రిలాక్స్ అవుతూ ట్వీట్ చేస్తున్న మాల్యా వర్మకు ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



