ఇప్పుడు వర్మ టార్గెట్ షారుఖ్ ఖాన్..!
on Apr 24, 2016

వర్మకు ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ వార్తల్లో ఉండటం హాబీ అని అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్, చిరంజీవిలను టార్గెట్ చేసిన వర్మ, లేటెస్ట్ గా షారుఖ్ పై తన ట్విట్టర్ గన్ ఎక్కుపెట్టాడు. షారుఖ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని చెబుతూనే, ఫ్యాన్ లాంటి సినిమాలు చేస్తే, షారుఖ్ స్టార్ డమ్ అంతా సల్మాన్ ఖాన్ కు కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. షారుఖ్ రాను రానూ సాధారణ వ్యక్తిగా, ఒక మరుగుజ్జులా మారిపోతున్నాడని అంటూ దక్షిణాదితో పోలిక తీసుకొచ్చాడు. ఒకప్పుడు కమల్ రజనీ సమానంగా ఉండేవారని, కానీ కమల్ ఇప్పుడు షారుఖ్ చేస్తున్న తప్పులే అప్పట్లో తాను చేసి, తన స్టార్ డం మొత్తాన్ని రజనీకి కోల్పోయాడని ఉదహరించాడు. క్యారెక్టర్ కోసం పొట్టిగా, పొడవుగా మారిపోవడాలు చేసి, ఉన్న స్టార్ డం ను అటకెక్కించద్దని, తన చుట్టూ ఉన్న తప్పుడు మనుషుల సలహాలు వినద్దని, తనకు దేవుడి మీద నమ్మకం లేకపోయినా, షారుఖ్ కోసం ఆ అల్లాను ప్రార్థిస్తున్నానంటూ ట్వీటాడు వర్మ.

పనిలో పనిగా షారుఖ్ కు బిస్కట్స్ కూడా వేశాడు. సల్మాన్ లాగా కండలు లేకపోయినా, అమీర్ అంతటి పనితనం లేకపోయినా, వాళ్లకంటే పెద్ద స్టార్ గా షారుఖ్ ఎదిగాడని ఆకాశానికి ఎత్తేశాడు. షారుఖ్ కమల్ లా కాకుండా, రజనీలా తాను తనలాగే ఉండాలని, అప్పుడే స్టార్ స్టేటస్ నిలబడుతుందని హితవు పలికాడు వర్మ. మరి ఈ నీతులన్నీ షారుఖ్ చెవి వరకూ వెళ్లాయో లేదో తెలియాలంటే, షారుఖ్ స్పందించేవరకూ వేచి ఉండాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



