Home

»

Latest News

రానాని అందుకు కాదు తీసుకుంది - వర్మ

Apr 26, 2011 10:33AM

"రానాని అందుకు కాదు తీసుకుంది" అని వర్మ అన్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తాను త్వరలో నిర్మించబోతున్న హిందీ సినిమా "డిపార్ట్ మెంట్" లో రానాని హీరోగా తీసుకోవటానికి గల కారణాలను ముంబయ్ మీడియా తమాషాగా వివరించింది. అభిషేక్ బచ్చన్, రానా, బిపాసా బసు నటించగా ఇటీవల విడుదలైన "దమ్ మారో దమ్" చిత్రం విడుదలకు ముందే ఆ చిత్రం క్లైమాక్స్ ను రామ్ గోపాల వర్మ అందరికీ యస్.యమ్.యస్.ల ద్వారా తెలిసేలా చేశాడట. అందుకు అలిగిన అభిషేక్ చ్చన్ "డిపార్ట్ మెంట్" సినిమాలో నటించనన్నాడనీ, అందుకనే గతిలేని పరిస్థితుల్లోనే రామ్ గోపాల వర్మ రానాని హీరోగా తీసుకున్నాడనీ ముంబయ్ మీడియా అంటోంది.

 ram goapal varma wallpapers, ram goapal varma stills, ram goapal varma images, ram goapal varma pics, ram goapal varma photos, ram goapal varma pictures

కానీ అది నిజం కాదనీ తాను ఎవరికీ "దమ్ మారో దమ్" చిత్రం క్లైమాక్స్ ని ఆ చిత్రం విడుదలకు ముందే ఎవరికీ యస్.యమ్.యస్.ల ద్వారా పంపలేదనీ అన్నాడు వర్మ. రానాని "డిపార్ట్ మెంట్" మూవీలో హీరోగా తీసుకోటానికి కారణం, అభిషేక్ బచ్చన్  డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్లనే అని మీడియాకు తెలిపాడు వర్మ. అంతేకాక తనకు అమితాబ్ బచ్చన్ కుటుంబం అంటే చాలా గౌరవం అనీ, అభిషేక్ బచ్చన్ అంటే అభిమానమనీ కూడా వర్మ అన్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com