Home

»

Latest News

‘ఒబ్సెషన్’ మూవీ చూసి.. 27 ఏళ్ల క్రితం ఊర్మిళ చేసిన మ్యాజిక్‌ను పొగిడేసిన వర్మ!

Jun 8, 2026 7:50PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టేస్ట్ ఎంత విభిన్నంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్స్, హారర్ జోనర్లలో ఆయన సృష్టించిన ట్రెండ్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా ఊపేసింది. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు ఒక హాలీవుడ్ సూపర్ హిట్ హారర్ సినిమా చూసి పూర్తిగా ఫ్లాట్ అయిపోయారు. అంతేకాదు, ఆ సినిమాలోని ఒక సీన్ చూసి తన క్లాసిక్ హిట్ ‘కౌన్’ చిత్రంలో ఊర్మిళా మాతోండ్కర్ చేసిన ఒక అద్భుతమైన నటనను గుర్తుచేసుకుంటూ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న హాలీవుడ్ చిత్రం ‘అబ్సెషన్’ . కర్రీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరెట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చూసిన వర్మ.. అందులోని ఒక ప్రత్యేకమైన సీన్‌ను, 1999లో వచ్చిన తన ‘కౌన్’ సినిమాలోని ఊర్మిళ ఎక్స్‌ప్రెషన్‌తో పోల్చుతూ ఒక చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. "ఒబ్సెషన్ చూసిన తర్వాత నాకు కౌన్ సినిమాలో ఊర్మిళ ఇచ్చిన ఈ షాట్ బాగా గుర్తొచ్చింది" అంటూ వర్మ రాసుకొచ్చారు.  

ఈ కంపారిజన్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఊర్మిళ మాతోండ్కర్ తలుపు వెనుక నుండి ఇచ్చే ఆ భయానకమైన, వింతైన నవ్వుకు, ఈ హాలీవుడ్ హీరోయిన్ హావభావాలకు పర్ఫెక్ట్ సింక్ కుదిరిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం, "హాలీవుడ్ నటి కంటే కూడా అప్పట్లో ఊర్మిళ చేసిన నటన 100 రెట్లు భయంకరంగా, అద్భుతంగా ఉంది" అంటూ ఆర్జీవీ వింటేజ్ మేకింగ్‌ను కొనియాడుతున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్‌పై ఆర్జీవీ తనదైన శైలిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద తారలు, వందల కోట్ల భారీ బడ్జెట్లు, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ఇండస్ట్రీ నమ్మకాన్ని ఈ చిన్న సినిమా పూర్తిగా మార్చేసిందని వర్మ ప్రశంసించారు. కేవలం ఏడు కోట్ల రూపాయల బడ్జెట్‌తో, కేవలం మూడు లొకేషన్లలో తీసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లకు పైగా) వసూలు చేసి థియేట్రికల్ బిజినెస్‌లో సరికొత్త ‘రీసెట్ బటన్’ నొక్కిందని ఆయన విశ్లేషించారు.  

దర్శకుడు కర్రీ బార్కర్ ఈ సినిమాలో ఎడిటింగ్‌ను ఒక సైకలాజికల్ వెపన్‌లా వాడారని, పాత్రల మూడ్‌ను ఎలివేట్ చేయడానికి వాడిన కెమెరా యాంగిల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వర్మ వివరించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక మాస్టర్ మేకర్ నుండి ఈ స్థాయి ప్రశంసలు దక్కడంతో ఇప్పుడు సౌత్ ఆడియన్స్‌లో కూడా ఈ ‘అబ్సెషన్’ సినిమాను ఎలాగైనా చూసేయాలనే క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com