
పెద్ది(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. తమ అభిమాన హీరో చరణ్ ని లైవ్ లో చూసిన ఆనందంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతు నా లక్కీయాస్ట్ సిటీ విజయవాడ. నాన్న గారి ఖైదీ నెంబర్ 150 , ఇంద్ర ఫంక్షన్స్ ఇక్కడే జరిగాయి. అందుకే పెద్దిని కూడా ఇక్కడే జరుపుతున్నాం. ఈవెంట్ కి వచ్చిన అక్కయ్యలకి, అన్నయ్యలకి, చెల్లెళ్లకి, తమ్ముళ్ళకి హాయ్. పెద్ది నా హృదయానికి దగ్గరైన కథ. నా లైఫ్ లాంగ్ నా సినీ లైబ్రరీలో ఉంటుంది. పెద్ది నన్ను మంచి దారిలోకి మార్చింది. నాన్న గారు చెప్పినట్టు పెద్ది లాంటి చిత్రం పది సంవత్సరాలకి ఒకటి వస్తుంది.
Also read: Peddi: చిరంజీవి ప్లేస్ లోకి రామ్ చరణ్.. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవీన్ కీలక వ్యాఖ్యలు
పెద్ది పడి లేచి మళ్ళీ నిలబడే యువకుడి కథ. ప్రతి రోజు షూటింగ్ వెళ్తున్నప్పుడు మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్' లా పాజిటివ్ గా అనిపించింది. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. సినిమాని ఎంతో కష్టపడి చేసేది మీ కోసమే. ఇంట్లో నాన్న, బాబాయ్ ని చూస్తూనే ఉన్నాను. మీ కోసం చేతులు విరగొట్టుకోవడం కాదు. రక్తం అయినా చిందిస్తాను. నాకు తెలిసిందల్లా సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు మెగా ఫ్యాన్స్ ని భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.






