Home

»

Latest News

రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీ

Mar 21, 2011 3:21PM

ram charan tej wallpapers, ram charan tej stills, ram charan tej images, ram charan tej photos, ram charan tej pics, ram charan tej picturesరామ్ చరణ్ హీరోగా ప్రకాష్ దర్శకత్వంలో ఒక మూవీ రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ దర్శకత్వంలో రాబోయే మూవీని ప్రముఖ నిర్మాత సి.(చలసాని) అశ్వనీదత్ నిర్మించనున్నారట. ఈ రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీకి కథ కూడా ఒ.కె అయ్యిందట. హీరో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవికి కూడా ఈ మూవీ కథ చాలా బాగా నచ్చిందనీ తెలిసింది.

ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ అంటే కోవెల మూడి సూర్య ప్రకాష్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు. ఇటీవల సిద్ధార్థ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన "అనగనగా ఓ ధీరుడు" చిత్రానికి దర్శకత్వం వహించిన కె.యస్.ప్రకాష్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా మూవీ చేతున్న ప్రకాష్ ఒకరే.

ఇది భారీ బడ్జెట్ తో నిర్మించే చిత్రమని సమాచారం. సి.అశ్వనీదత్ ప్రస్తుతం యన్ టి ఆర్ హిరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో "శక్తి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చ్ 30 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ "శక్తి" చిత్రం అనంతరం రామ్ చరణ్ హీరోగా ప్రకాష్ మూవీని ప్రారంభిస్తారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com