
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' (PEDDI) బాక్సాఫీస్ బరిలోకి దిగకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త చరిత్రను సృష్టించింది. విడుదలైన క్షణం నుండే యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ ట్రైలర్, తాజాగా ఊహించని రేంజ్‌లో ఏకంగా 101 మిలియన్లకు పైగా (101M+) వ్యూస్ సాధించి ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. టాలీవుడ్ హిస్టరీలోనే కేవలం 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించిన 'హైయెస్ట్ వ్యూడ్ తెలుగు ట్రైలర్' (Highest Viewed Telugu Trailer in 24 Hours) గా నిలిచి 'పెద్ది' రికార్డుల జాతరను కళ్లముందు ఉంచింది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ మూవీస్ ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ 1 (#1 On Movies Trending Chart) స్థానంలో కొనసాగుతూ, మోస్ట్ హైప్డ్ వీడియోగా ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ లో ఊర మాస్ బాడీ లాంగ్వేజ్‌తో సరికొత్త విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ కనిపిస్తున్న విధానం సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతోంది. లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బుచ్చిబాబు మార్క్ టేకింగ్ ఈ విజువల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయి.
వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల దుమ్ము దులిపేందుకు 'పెద్ది' జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ట్రైలర్‌తోనే 101 మిలియన్ల ఊచకోత కోసిన మెగా పవర్ స్టార్, ఇక థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.





