.jpg)
రామ్‌చరణ్ యాక్టింగు స్టైల్ చూస్తుంటే చిరంజీవి గుర్తొస్తుంటారు. డైలాగ్ చెబుతున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజీలోనూ... డాడీనే. ఆ కటింగులూ అచ్చంగా చిరంజీవే. నాన్న ఫ్యాన్స్‌ని ఖుషీ చేయాలనే తాపత్రయమో, లేదంటే బ్లడ్‌లోనే అది ఉందో తెలీదుగానీ.. ఈ అనుకరణ మాత్రం మరీ ఎక్కువైపోయింది. నాన్న పాటల్ని సొంత ఆస్తిగా వాడుకోవడం కూడా మానడం లేదు. బంగారు కోడి పెట్ట, వానావానా వెల్లువాయె, శుభలేఖ రాసుకొన్న పాటల్ని ఇప్పటికే రీమేక్ చేసేశాడు. ఈ మూడు పాటలూ పాత పాటల స్టాండర్డ్స్‌లో లేవని తెలిసినా.. ఏదో ఫ్యాన్స్ చూస్తున్నారు కదా అని తెగ రుద్దేస్తున్నాడు. తాజాగా కొత్త సినిమాలోనూ డాడీ పాట ఉండాల్సిందే అని కండీషన్ పెట్టాడట. దాంతో శ్రీనువైట్ల, తమన్ లు కలసి చిరంజీవి సూపర్ హిట్ గీతాల లిస్టొకటి తయారు చేశారు. అందులో అబ్బనీ తీయని దెబ్బ పాటపై టిక్కు పెట్టాడట చరణ్. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ఆ సూపర్ హిట్ గీతం... ఆల్ టైమ్ గ్రేట్ మెలోడీల్లో ఒకటి. అంతేనా.. ఆ పిక్చరైజేషన్, చిరు - శ్రీదేవి కాంబినేషన్, వాళ్లు వేసిన స్టెప్పులు సూపరో సూపర్. మళ్లీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టం. పాత పాటని తీయటి జ్ఞాపకంగా వదిలేయకుండా చరణ్ బాబు అంత కంగాళీ ఎందుకు చేయాలనుకొంటున్నాడో ఏమో. చరణ్ ఫ్యాన్స్ ఈ రీమిక్స్ విషయం తెలిసి ఖుషీ అవుతుంటే.. పాత పాటల్ని ఇష్టపడేవాళ్లు మాత్రం `తమన్ చెడగొట్టేస్తాడేమో` అని గుండెలు పట్టుకొని కూర్చున్నారు. తమన్ వీర బాదుడులో ఆ మెలోడీ ఏమైపోతుందో, ఏంటో..




.jpg)
