Home

»

Latest News

చ‌ర‌ణ్ కోసం చిరు చేసిన త్యాగం

Oct 12, 2016 11:26AM

ఈ ద‌స‌రాకి టీజ‌ర్ల హంగామా బాగానే క‌నిపించింది. ధృవ, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి, న‌క్ష‌త్రం టీజ‌ర్లు బయ‌ట‌కు వ‌చ్చాయి.  చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 టీజ‌ర్ కూడా బ‌య‌ట‌కు రావ‌ల్సిందే. వినాయ‌క్ ద‌స‌రా కోసం టీజ‌ర్‌ని కూడా క‌ట్ చేశాడ‌ట‌. అయితే.. చివ‌రి నిమిషాల్లో డ్రాప్ అయిన‌ట్టు స‌మాచారం. దానికి కార‌ణం రామ్‌చ‌ర‌ణ్ అని టాక్‌. చ‌ర‌ణ్  ధృవ టీజ‌ర్ ఈ ద‌స‌రాకి విడుద‌ల చేశారు. త‌న‌యుడితో పాటు తానూ ఓ టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం ఎందుకు?? అని చిరు కాస్త వెన‌క‌డుగు వేశాడ‌ట‌. చిరు, చ‌ర‌ణ్‌ల టీజ‌ర్లు ఒకేసారి బ‌య‌ట‌కు వ‌స్తే చిరు టీజ‌ర్ కోస‌మే జ‌నం మాట్లాడుకొంటారు. ధృవ కోసం చ‌ర‌ణ్ పెట్టిన ఎఫెక్ట్ మొత్తం వేస్ట‌యిపోతుంది. అందుకే.. ద‌స‌రా ఆఫ‌ర్ చిరు చ‌ర‌ణ్ కే వ‌దిలేశాడ‌ట‌. అయితే దీపావ‌ళికి మాత్రం చిరు త‌న టీజ‌ర్‌తో హ‌డావుడి చేయ‌డం ఖాయ‌మంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. కొత్త సినిమాల టీజ‌ర్ల హ‌డావుడి ద‌స‌రాకే పూర్త‌య్యింది. ఇక మిగిలింది చిరు సినిమానే. దీపావ‌ళికి ఖైదీ నెం.150 టీజ‌ర్ సోలోగా చూసే ఛాన్సుంద‌న్న‌మాట‌. ధృవ‌లో రామ్‌చ‌ర‌ణ్ స్టైలీష్ గా క‌నిపిస్తే.. చిరు ఇంకెంత హంగామా చేశాడో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com