Home

»

Latest News

Rakul Preet Singh: ఆ ఒక్క తప్పు.. 40 రోజులు మంచానికే పరిమితమైన రకుల్ ప్రీత్ సింగ్!

Jun 4, 2026 3:59PM

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జిమ్‌లో తనకు ఎదురైన ఒక భయానక ప్రమాదం గురించి సంచలన నిజాలను పంచుకుంది. నిరంతరం వర్కవుట్లు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ హీరోయిన్, ఇటీవల ఒక టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొని తన జీవితాన్ని మార్చేసిన ఆ చీకటి రోజులను గుర్తుచేసుకుంది. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా తను ఎంతటి నరకాన్ని అనుభవించిందో, అది తనను శారీరకంగానే కాకుండా మానసికంగా ఎంతలా కుంగదీసిందో వివరిస్తూ రకుల్ ఎమోషనల్ అయింది. ట్రైనర్లు ఏం చెప్పినా వినవద్దని, జిమ్‌లో చేసే డెడ్‌లిఫ్ట్ అనేది కేవలం 'ఈగో లిఫ్ట్' మాత్రమేనని, అది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామమని రకుల్ ఇండస్ట్రీ వర్గాలకు మరియు ఫిట్‌నెస్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ప్రమాదం కొంతకాలం క్రితం రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో భారీ వర్కవుట్ చేస్తున్న సమయంలో జరిగింది. ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండా రకుల్ ఏకంగా 80 కేజీల బరువైన డెడ్‌లిఫ్ట్ ఎత్తడానికి ప్రయత్నించింది. సాధారణంగా ఎప్పుడూ బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉన్న రకుల్, ఆ ఒక్కరోజు మాత్రం అనుకోకుండా ఆ నియమాన్ని దాటవేసింది. బరువు ఎత్తిన వెంటనే ఆమె వెన్నుముక భాగంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తింది. ఆ బరువు ఒత్తిడికి రకుల్ వెన్నుముకలోని L4, L5 మరియు S1 నరాలు పూర్తిగా జామ్ అయిపోయాయి. దీనివల్ల ఆమె బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ, తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను గౌరవిస్తూ 'దే దే ప్యార్ దే 2' సినిమా షూటింగ్‌లో పాల్గొంది. వరుసగా రెండు రోజుల పాటు కేవలం కండరాల నొప్పులు తగ్గించే మెడిసిన్ వేసుకుంటూ రకుల్ షూటింగ్ పూర్తి చేయడం విశేషం.

ఆ తర్వాత ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. నొప్పి తీవ్రత తట్టుకోలేక ఇంజక్షన్లు, మందులు వాడాల్సి వచ్చింది. వైద్యులు ఆమెను పరీక్షించి 'స్లిప్ డిస్క్' అయినట్లు నిర్ధారించి, కదలకుండా పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అలా ఆ ఒక్క తప్పు రకుల్‌ను ఏకంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితం చేసింది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఆ సినిమా కోసం రకుల్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ 40 రోజులు తాను ఒక కూరగాయలా మారిపోయానని, అసలు మళ్లీ జీవితంలో నిలబడతానా లేదా నడుస్తానా అనే భయం తనను వెంటాడిందని రకుల్ ఎమోషనల్ అయింది. 

ఆ సమయంలో మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్‌కు వచ్చినప్పుడు కూడా ఆమె కనీసం కుర్చీలో సరిగ్గా కూర్చోలేకపోయేది. దాంతో సినిమాలోని సగం సీన్లను కేవలం ఫిజియోథెరపీ బెడ్‌పైనే చిత్రీకరించారని, అయితే స్క్రీన్‌పై చూసే ప్రేక్షకులకు అది అస్సలు తెలియకుండా జాగ్రత్త పడ్డారని రకుల్ వెల్లడించింది. 

ఈ శారీరక నరకం కంటే మానసిక వేదన తనను మరింత ఎక్కువగా కుంగదీసిందని, హఠాత్తుగా ఏ పని చేసుకోలేని స్థితికి వెళ్లడం ఎంతో భయాన్ని కలిగించిందని పేర్కొంది. ఈ కష్టకాలంలో తన భర్త జాకీ భగ్నానీ తనకు అందించిన సపోర్ట్ వల్లే తాను కోలుకోగలిగానని, పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆ భయానక క్షణాలను పంచుకుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com