
చిన్న చిత్రంగా థియేటర్లలోకి వచ్చి, పెద్ద విజయాన్ని నమోదు చేసిన సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, సహజసిద్ధమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ మూవీ ద్వారా నటి తేజస్వి రావు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అమాయకమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ, ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇప్పటివరకు తను నటించిన 'కమిటీ కుర్రాళ్లు', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి సినిమాల్లో చాలా పద్ధతిగా చుడిదార్, లంగా ఓణీ, చీరకట్టులోనే కనిపిస్తూ పక్కా హోమ్లీ ఇమేజ్‌ను సంపాదించుకుంది తేజస్వి. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్‌కు వెళ్లగా, అక్కడ చిల్ అవుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఆ పిక్స్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని రేంజ్‌లో తేజస్వి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో, బోల్డ్ అవతార్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది.
తేజస్వి గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు "రాంబాయి రూట్ మార్చిందిగా.." అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Raju Weds Rambai, Tejaswi Rao, Instagram





