
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తలైవా 166వ చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో రజినీ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రంలో రజినీ సరసన నటించబోయే హీరోయిన్ల పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. నయన తార, కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించింది. గతంలో రజనీ, నయనతార కాంబినేషన్‌లో చంద్రముఖి, కథానాయకుడు చిత్రాలు వచ్చాయి. ఇక కీర్తి సురేష్ విషయానికొస్తే.. రజినీ సరసన ఈమె నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.






