సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘ధర్మన్’ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రూమర్‌గా ఉన్న ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. రజినీకాంత్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను హీరోయిన్ రాశీఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
మైసూరులో షూటింగ్ సందర్భంగా అక్కడి దోశతో పాటు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను రాశీఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే సమయంలో రజినీకాంత్, రామ్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ‘ధర్మన్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడంటూ గతంలో వచ్చిన వార్తలకు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లయింది. కొద్దిసేపటికే ఆ ఫొటోను రాశీఖన్నా డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో రాశీఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె రజినీకాంత్ కూతురి పాత్రలో నటిస్తుండగా.. రామ్ పోతినేని ఆమె ప్రియుడిగా కనిపించనున్నాడని సమాచారం. అయితే రామ్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. దీంతో ఈ సినిమాలో రామ్ ఇంతకుముందు చేసిన పాత్రలకు భిన్నమైన లుక్, క్యారెక్టరైజేషన్‌లో కనిపించే అవకాశం ఉందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇక ‘ధర్మన్’ చిత్రానికి ‘డ్రాగన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రామ్ పోతినేని కూడా సినిమాలో భాగమయ్యాడనే విషయం బయటకు రావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
[Rajinikanth Dharman Movie, Ram Pothineni Dharman, Raashii Khanna, Rajinikanth Ram Pothineni, Ashwath Marimuthi, Dharman Movie Update, Ram Pothineni New Movie]





