Home

»

Latest News

మిస్టరీగా మారుతున్న రజినీకాంత్ ఆరోగ్యం..!

Jul 1, 2016 12:02PM

రజనీకాంత్ కు ఏమైంది…? ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందా…? ప్రస్తుతం సూపర్ స్టార్ పై ఈ పుకార్లు మరోసారి గుప్పమంటున్నాయి అప్పట్లో కొచ్చడయాన్ సినిమా ప్రారంభమైన కొత్తలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రజనీకాంత్. అయితే ఆ తర్వాత పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలో నటించారు. ఎంత ఆరోగ్యంతో ఉన్నారంటే…. ఈమధ్య ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేసేంత ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో ‘కబాలి’ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఈ ఏడాదంతా సమయం పడుతుంది. అయితే ఇంతలోనే రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చాయి.

ఈ వార్తలను ఖండిస్తూ... రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన అమెరికా వెళ్లారని రజనీ సోదరుడు సత్యనారాయణ వెల్లడించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ‘కబాలి’ సినిమా రిలీజ్ సమయానికి ఆయన చెన్నైకి వస్తారని చెప్పారు. రజనీ ఆరోగ్యం గురించి తల్లడిల్లుతున్న ఆయన అభిమానులందరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుందని అన్నారు. రోబో 2లో నటిస్తున్నాడు కదా శంకర్ కోరిక మేరకు మేకప్ టెస్ట్ కోసం స్కిన్ డాక్టర్ సలహా కోసం వెళ్లాడే కానీ ఎలాంటి అనారోగ్యసమస్యలు లేవని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com