Home

»

Latest News

రజనీకాంత్, కమల్ హాసన్ క్రికెట్ ఆడతారా..?

Feb 18, 2016 7:32PM

రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి క్రికెట్ ఆడతారా..ఇది సాధ్యమా..గత ఏడాది రసాభాసగా జరిగిన నడిగర్ సంఘం ఎన్నికలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటి నుంచే చాలామందికి నడిగర్ సంఘం గురించి తెలిసింది. విషయంలోకి వెళ్తే, ఈ సంఘానికి ఇప్పటి వరకూ అసలు సొంత భవనమే లేదు. దక్షిణ భారత నటీనటుల సంఘమని గొప్ప పేరున్నా, ఇప్పటి వరకూ దీనికి ఒక బిల్డింగ్ కూడా లేకపోవడం విచిత్రమే..

మొన్నటి ఎన్నికల్లో గెలిచిన విశాల్ అండ్ కో, ఇదే పాయింట్ ను నొక్కి వక్కాణించి మరీ గెలిచింది. అందుకే గెలవగానే, వెంటనే సొంత బిల్డింగ్ పనులు మొదలెట్టారు. తమ దగ్గర ఉన్న 48 లక్షలతో పాటు, బ్యాంక్ లో 2 కోట్ల రూపాయలు అప్పు చేసి, బిల్డింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ అప్పు తీర్చడానికి నిధులు సమీకరించడానికి సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ ఒకటి చెన్నైలో ప్లాన్ చేశారు. ఏప్రిల్ 10 న జరిగే ఈ మ్యాచ్ లో కమల్ హాసన్, రజనీకాంత్ కూడా భాగం కాబోతున్నారని నడిగర్ సంఘం ప్రకటించింది. వీళ్లిద్దరూ భాగం కావడమంటే, ఆడతారా..లేక వచ్చి చూస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఈ స్టార్స్ అభిమానుల్ని వేధిస్తున్నాయి. వాళ్లు ఆడే అవకాశం చాలా తక్కువే ఉంటుందని, జస్ట్ వచ్చి, ప్లేయర్స్ కు ఎంకరేజ్ మెంట్ ఇస్తారనేది కొంతమంది మాట. మరి ఈ మహానటులు ఏం చేస్తారో చూడాలి..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com