ఎవరు ఎటు వైపు.. ఏం జరగబోతుంది!
on Nov 19, 2025
![]()
-చిరంజీవి ఎటు వైపు
-రాజమౌళి ఎటు వైపు
-ఏం జరగబోతుంది
-రాజమౌళి పై హిందూ సంఘాల ఆగ్రహం
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ఈ ఇద్దరి లెజండ్స్ వల్ల తెలుగు సినిమాకి వచ్చిన గుర్తింపు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. అభిమాన బలం కూడా ఎక్కువే. పోస్టర్ పై ఈ ఇద్దరి ఫోటో కనపడితే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి కాదేది చర్చకి అనర్హం అనే రీతిలో లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా వాడి వేడి చర్చ జరుగుతుంది.
రాజమౌళి రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ 'వారణాసి'(Varanasi)ఫంక్షన్ లో మాట్లాడుతు 'దేవుడ్నినమ్మనని, ఆంజనేయుడు నన్ను నడిపిస్తాడని మా నాన్న చెప్పాడు. ఇదా నన్ను నడిపించేది అని అసహనంగా మాట్లాడటం జరిగింది. ఈ మాటలు హిందూసంఘాలకి, ఆంజనేయ స్వామి భక్తులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. రాజమౌళి పై పోలీస్ కేసు నమోదు చెయ్యడంతో పాటు పలు ఛానెల్స్ లో రాజమౌళి కి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాజమౌళి కి చెందిన ఈ ఎపిసోడ్ మొత్తాన్నిసోషల్ మీడియా వేదికగా కొంత మంది చిరంజీవి కి లింక్ చేస్తున్నారు. చిరంజీవి ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. తన ఉఛ్వాస, నిచ్వాస ల్లోను ఆంజనేయుడినే తలుచుకుంటూ ఉంటాడు. తన జీవితం ఎదుగుదలతో పాటు తన కుటుంబసభ్యులు బాగుండటానికి ఆంజనేయుడు కారణం అని బలంగా నమ్ముతాడు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ చిరంజీవి నే స్వయంగా చెప్పాడు.
also read: అంతా నకిలీనే నమ్మకండి.. అభిమానులకి షాక్ ఇచ్చిన శ్రియా
పైగా చిరంజీవి అనే పేరే ఆంజనేయ స్వామిది. మరి ఇప్పుడు రాజమౌళి ఏమో ఆంజనేయ స్వామి నన్ను నడిపించేది ఇదా అని అన్నాడు. ఆ వ్యాఖ్యలని ప్రపంచం మొత్తం చూసింది. చిరంజీవి కూడా చూసే ఉంటాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి, రాజమౌళి ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకోవలసి వస్తే అప్పుడు ఆ ఇద్దరి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. చిరంజీవి, రాజమౌళి మధ్య మాత్రం సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



