Home

»

Latest News

రాధికా ఆప్టే.. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్!

Jul 2, 2022 5:37PM

ఇటు ద‌క్షిణాదిలోనూ, అటు ఉత్త‌రాదిలోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది టాలెంటెడ్ యాక్ట్ర‌స్ రాధికా ఆప్టే. అంతేకాదు.. ఆంగ్ల భాష‌లోనూ కొన్ని చిత్రాల్లో క‌నువిందు చేసి త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉంటే, 2022 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ఈ 'లెజెండ్' స్టార్ కి ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సంవ‌త్స‌రం రాధికా ఆప్టే రెండు హిందీ సినిమాల్లో న‌టించ‌గా.. ఆయా చిత్రాలు ద‌క్షిణాది రీమేక్స్ కావ‌డంతో పాటు రెండు కూడా ఒరిజిన‌ల్ టైటిల్స్ తోనే తెర‌కెక్క‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. 2020లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం `ఫోరెన్సిక్` ఆధారంగా అదే టైటిల్ తో రూపొందిన బాలీవుడ్ మూవీ `ఫోరెన్సిక్`. జూన్ 24న ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జీ5లో నేరుగా స్ట్రీమ్ అయింది.

అలాగే, త‌మిళ చిత్రం `విక్ర‌మ్ వేద‌` (2017) ఆధారంగా అదే టైటిల్ తో తెర‌కెక్కిన హిందీ సినిమా `విక్ర‌మ్ వేద‌`. సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోష‌న్ టైటిల్ రోల్స్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధమైంది. మొత్తమ్మీద.. ఒకే క్యాలెండర్ ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ మూవీస్ తో రాధికా ఆప్టే పలకరించడం విశేషమనే చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com