Home

»

Latest News

హీరోయిన్‌కి ఊహించని షాక్.. సెల్ఫీ అంటూ వచ్చి బుగ్గలు గిల్లిన అభిమాని.!

Oct 3, 2026 11:18AM

కన్నడ సినీ నటి రచితా రామ్‌ పుట్టినరోజు వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 3న తన బర్త్‌డే సందర్భంగా అభిమానులను కలుసుకున్న ఆమె.. వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని రచితా రామ్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అతడు.. ఒక్కసారిగా ఆమె రెండు బుగ్గలను గిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో రచిత కాసేపు షాక్‌కు గురయ్యారు. అయితే వెంటనే తేరుకుని చిరునవ్వుతో మిగతా అభిమానులతో ఫొటోలు దిగుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రచితా రామ్‌ను అభిమానులు ముద్దుగా ‘డింపుల్ క్వీన్’ అని పిలుచుకుంటారు. ఆమె అసలు పేరు బిందియా రాము. ప్రముఖ భరతనాట్య కళాకారుడు కేఎస్ రాము కుమార్తె అయిన రచిత.. చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. బుల్లితెరపై సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 2013లో ‘బుల్‌బుల్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రన్నా’, ‘రథవర’, ‘చక్రవ్యూహ’, ‘భర్జరి’, ‘నటసార్వభౌమ’, ‘క్రాంతి’ వంటి సినిమాలతో కన్నడలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

ఇక పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం రచితకు ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సరదా అభిమాన చర్యగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం అభిమానం పేరుతో సెలబ్రిటీల అనుమతి లేకుండా తాకడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు తమ అభిమాన తారలను కలిసే సమయంలో వారి వ్యక్తిగత పరిధిని గౌరవించాలని పలువురు సూచిస్తున్నారు.

కాగా రచితా రామ్‌ కన్నడ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’లో నటించిన ఆమె.. రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానున్నట్లు కథనం పేర్కొంది.

 

 

[Rachita Ram, Rachita Ram Birthday, Rachita Ram Fan Video, Rachita Ram Viral Video, Kannada Actress Rachita Ram, Rachita Ram Birthday Celebration, Rachita Ram Fan Pinches Cheeks, Rachita Ram Latest News, Rachita Ram Coolie, Rachita Ram Kaka Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com