Home

»

Latest News

"రచ్చ" కోసం రాంబోలా రామ్ చరణ్

Mar 14, 2011 7:36PM

ram charan stiils, ram charan images, ram charan pics, ram charan photos, ram   charan pictures, ram charan wallpapers"రచ్చ" చిత్రం కోసం రాంబోలా రామ్ చరణ్ తయారవుతున్నాడని సమాచారం. అంటే హాలీవుడ్ చిత్రాలు రాంబో సీరీస్ లో నటించిన సిల్వెస్టర్ స్టాలోన్ వంటి శరీరాన్ని పోందటానికి మన రామ్ చరణ్ మియామీలోని ఆల్ట్రా మోడరన్ జిమ్ లో ట్రైనింగవుతున్నాడు.

 

రామ్ చరణ్ హీరోగా నటించిన రెండవ చిత్రం "మగధీర"లోనే తన కండలు తిరిగిన శరీరాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ మియామీలో "రచ్చ" కోసం రాంబోలా తన శరీరాన్ని కండలుతిరిగేలా అత్యంత నూతన వ్యాయామసూత్రాలను పాటిస్తూ చేస్తున్న వ్యాయామం వల్ల మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నాడు రామ్ చరణ్.

 

రామ్ చరణ్ హీరోగా, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, "ఏమైంది ఈ వేళ " చిత్ర దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో, యన్ వి ప్రసాద్ ‍, పరాస్ జైన్ నిర్మిస్తున్న తన నాలుగవ చిత్రం "రచ్చ" కోసం తన శరీరాన్ని ఆ విధంగా మలచుకుంటున్నాడు రామ్ చరణ్. రాంబోలా తయారైన రామ్ చరణ్ తను నటించబోయే "రచ్చ" సినిమాలో ఏం రచ్చ రచ్చ చేస్తాడో వేచి చూడాలి. ఈ "రచ్చ" చిత్రం ఏప్రెల్ రెండవ వారంలో ప్రారంభం కాబోతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com