Home

»

Latest News

Raasi: అజయ్ ఘోష్ పై రాశి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను అనుకుంది ఆ హీరోని 

Apr 18, 2026


  

-మొన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన పాపం ప్రతాప్ '
-అజయ్ ఘోష్ నా భర్తని చెప్పారు
-నేను అనుకున్నది మాత్రం వేరు 
-ఆసక్తిని కలిగిస్తున్న రాశి వ్యాఖ్యలు 

రాశి(Raasi)కి ఉన్నసినీ క్యాపబాలిటీ గురించి తెలిసిందే. తన అందంతో, అంతకంటే అందమైన నటనతో సిల్వర్ స్క్రీన్ పై హీరోలని తన అభిమానులుగా మార్చుకుంది. మరి ఈ లెక్కన  అభిమానులు, ప్రేక్షకులు రాశితో ఎంతగా కనెక్ట్ అయ్యి ఉంటారో చెప్పక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మొన్న 'పాపం ప్రతాప్ '(Papam Prathap)అనే చిత్రంతో హీరోకి మదర్ గా సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది. ఈ చిత్రం గురించి రాశి మాట్లాడుతు చెప్పిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

రాశి మాట్లాడుతు నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆర్టిసుల పేర్లు మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు పెద్దగా తెలియవు. మనుషులని చూస్తే మాత్రం గుర్తుపడతాను. పాపం పసివాడులో నా భర్తగా అజయ్ ఘోష్ అని చెప్పారు. నేనేమో అజయ్(విక్రమార్కుడు విలన్)  అనుకున్నాను. సెట్ కి వెళ్తే అజయ్ ఘోష్ గారు కూర్చొని ఉన్నారు. నేనేమో అజయ్ కోసం వెతుకుతున్నాను. దాంతో ఒక అమ్మాయిని అడిగితే నా భర్త అజయ్ ఘోష్ అని చెప్పిందని రాశి చెప్పుకొచ్చింది. దీంతో అక్కడున్న వాళ్ళందరు నవ్వారు. 


Also read: vd shouryuv: గ్లోబల్ టెక్నీషియన్స్ తో విజయ్ దేవరకొండ కొత్త మూవీ.. డైరెక్టర్ పేరు తెలిస్తే షాక్ అవుతారు


ఆ తర్వాత అజయ్ ఘోష్(Ajay Ghosh)గురించి మాట్లాడుతు అజయ్ ఘోష్ గారు సింగల్ టేక్ ఆర్టిస్ట్ తో పాటు మంచి ప్రతిభావంతమైన ఆర్టిస్ట్  అని చెప్పుకొచ్చింది. ఇక పాపం ప్రతాప్ ' లో అజయ్ ఘోష్, రాశి ఫెయిర్ కి మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన రాశి అభిమానులు అయితే మరిన్ని సినిమాలు చేసి తమని అలరించాలని కోరుతున్నారు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com