Home

»

Latest News

Raaka: రాకా, ఐకి పోలిక ఉందా!... ఏంటి పరిస్థితి  

Apr 09, 2026

 

-బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి రాకా గిఫ్ట్ 
-ఐ తో ఎందుకు పోలుస్తున్నారు
-అసలు నిజం ఏంటి

ఏంటి పరిస్థితి అనే మాట ఎక్కువగా బడా హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు టాక్ ఎలా ఉందని తెలుసుకోవడానికి ఒక అభిమాని, మరో అభిమాని మధ్య తిరిగే వర్డ్. పైకి సింపుల్ వర్డ్ లాగానే అనిపించవచ్చు. కానీ ఆ మాట అడుగుతున్నప్పుడు అభిమానుల హృదయ నాళాల్లో కొలువుతీరి ఉండే  స్పందన, ప్రతి స్పందనని వెలకట్టలేం. ఇప్పుడు అదే స్పందన, ప్రతి స్పందన అల్లు అర్జున్, అట్లీ(Atlee)'రాకా'(Raaka)పై పడింది. మూవీ రిలీజ్ కాకుండానే ఆ అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం.

రాకా.. అల్లు అర్జున్(Allu Arjun)కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటుంది. అట్లీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా స్థాయిలో తన జెండా పాతాలనే సంకల్పంతో ఉన్నాడు. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా  నిన్న,మొన్న రిలీజైన అల్లు అర్జున్ స్టిల్స్ చూస్తుంటే విక్రమ్(vikram),శంకర్(Shankar)ల 'ఐ'(I)మూవీ గుర్తుకొస్తుంది. 'ఐ' లో 'మృగం,మనిషి' కలయికలో ఒక విచిత్రమైన ఆకారంలో విక్రమ్ కనిపించాడు. సినీ లాంగ్వేజ్ లో బీస్ట్ గెటప్. ఇప్పుడు రాకాలో అల్లు అర్జున్ ఇంచు మించు అదే టైప్ లో కనిపించాడు. దీంతో రాకాలో అల్లు అర్జున్ బీస్ట్ క్యారక్టర్ లో  క నిపిస్తాడేమో అనే టాక్ మొదలైంది. 

Also read: Adivi Sesh: అడివి శేష్‌ని తీసేసిన కృష్ణ‌వంశీ


మరి 'ఐ' రిజల్ట్ తెలిసిందే కాబట్టి అభిమానులు, మూవీ లవర్స్ మధ్య  'ఏంటి పరిస్థితి' అనే మాట చక్కర్లు కొడుతుంది. రాకా అయితే ప్రెజెంట్ శరవేగంతో చిత్రీకరణ జరుపుకుంటుండగా మూడు భిన్నమైన షేడ్స్ లో అల్లు అర్జున్ కనిపించనున్నాడనే టాక్ కూడా ఉంది. త్రిబుల్ రోల్ అని కూడా టాక్. ఏది ఏమైనా మేకర్స్ ప్రకటించే దాకా రాకా గురించి రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. గతంలో రాత్రి సమయాన ఆరు బయట పడుకొని చందమామ కథలు చెప్పుకునే వాళ్ళం కదా.. ఆ టైంలో వచ్చే మన ఊహలకి మించి రాకా ఉండబోతుంది. పక్కా  అడ్వెంచర్, సైన్స్ థ్రిల్లర్. దీపికా పదుకునే వన్ ఆఫ్ ది హీరోయిన్.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com