Home

»

Latest News

'రాకా'లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. వైల్డ్ లుక్‌లో ఊరమాస్ రచ్చ.!

Jul 27, 2026 3:25PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా'. 'పుష్ప' తర్వాత బన్నీ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఒక సంచలనాత్మక అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాబోయే షెడ్యూల్‌లో అల్లు అర్జున్ మైండ్ బ్లాకింగ్ ఎంట్రీ సీన్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తోంది.

ఈ ఊరమాస్ ఎంట్రీ సన్నివేశం కోసం ఒక భారీ సెట్‌ను కూడా ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోయే ఎంట్రీ సీన్స్‌లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించేందుకు అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్‌తో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా విజువల్ వండర్‌గా ఈ ఎంట్రీ సీన్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. అత్యంత భారీ స్థాయిలో, మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎపిసోడ్లు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్.

 

 

Raaka Movie, Allu Arjun, Entry Scene, Atlee

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com