Home

»

Latest News

నవంబర్ 12న 'పుష్పక విమానం' ల్యాండ్!

Sep 28, 2021 5:29PM

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్పక విమానం'. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. దామోదర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 

'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న 'పుష్పక విమానం' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా 'కళ్యాణం కమనీయం' సాంగ్ సూపర్ హిట్టయి సినిమాకు ఆకర్షణగా నిలించింది. ఇదిలా ఉంటే మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 12న సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా డైరెక్టర్ దామోదర మాట్లాడుతూ.. "పుష్పక విమానం ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామా ని గుర్తుచేస్తూ, పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం" అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com