ENGLISH | TELUGU  

పుష్పరాజ్ మళ్ళీ వస్తుండు.. బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

on Sep 11, 2023

"తగ్గేదేలే".. అంటూ 'పుష్ప - ది రైజ్'తో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు.. పుష్పరాజ్ గా తన అభినయంతో బెస్ట్ యాక్టర్ గా తొలి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. 

ఇదిలా ఉంటే, పుష్ప ది రైజ్ పేరుతో 2021 డిసెంబర్ 17న మొదటి భాగం రాగా, రెండో భాగం పుష్ప ది రూల్ కి కూడా మంచి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు సుకుమార్ అండ్ టీమ్. 2024 ఆగస్టు 15కి పుష్ప ది రూల్ తెరపైకి రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. మరి.. పుష్ప ది రైజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. పుష్ప ది రూల్ తో అంతకుమించి ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి. 

కాగా, పుష్ప ది రూల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఇందులో బన్నీకి జంటగా రష్మికా మందన్న నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ గా కొనసాగనున్నాడు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.