పుష్ప 2 టికెట్స్ ఇంతకి మాత్రమే అమ్మాలంటున్న ఏపి ప్రభుత్వం
on Dec 2, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)కి తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ ఇవ్వగా,ఇప్పుడు పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో పాటుగా ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ప్రీమియర్ షోస్ పడనుండగా, టికెట్ రేటు ఎనిమిదివందల దాకా అమ్ముకోవచ్చని చెప్పింది.ఇక రిలీజ్ రోజు డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ కంటే రెండు వందలు అధికంగా, సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు నూట యాభై, లోయర్ క్లాసుకు వంద రూపాయిలు అధికంగాపెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



