Home

»

Latest News

పూరి ప‌రువు తీసేసిన మాజీ సీఎమ్‌

Sep 21, 2016 12:23PM

పూరి జ‌గ‌న్నాథ్‌కి ఇప్పుడంటే హిట్లు లేక‌పోవొచ్చు. కానీ పూరి అంటే ఎప్ప‌టికీ క్రేజే. తెలుగు చిత్ర సీమ నివ్వెర‌పోయే సినిమాల్ని అందివ్వ‌డంలో దిట్ట‌. అందుకే స్టార్ హీరోలు ఇప్ప‌టికీ పూరీ.. పూరీ అంటూ ఆయ‌న పేరే జ‌పిస్తుంటారు. అలాంటి పూరి.. ఓ కొత్త హీరోకి క‌థ చెబితే వ‌ర్క‌వుట్ అవ్వ‌కుండా ఉంటుందా??  ఆ క‌థ న‌చ్చ‌లేదు అని పూరి ని ప‌క్క‌న పెట్టేయ‌డం జ‌రుగుతుందా?  క‌థ‌దే ముంది?  పూరితో సినిమా చేస్తే చాలు అనుకొని రంగంలోకి దిగిపోతారు. కానీ... ఈ సీన్ పూర్తిగా రివ‌ర్స్‌లోజ‌రిగింది. పూరి క‌థ‌ని ప‌క్క‌న పెట్టి ఓ కొత్త హీరో షాక్ ఇచ్చాడు.

క‌ర్నాట‌క మాజీ సీఎమ్ కుమార‌స్వామి త‌నయుడు నిఖిల్ కోసం క‌థ‌లు వింటున్న‌ప్పుడు పూరికీ పిలుపొచ్చింది. పూరి వెళ్లి ఓ క‌థ కూడా చెప్పాడు. ఓ కొత్త కుర్రాడితో పూరి సినిమా తీయ‌డం క‌చ్చితంగా ఆ సినిమాకి హైప్ తెచ్చే పాయింటే. కానీ కుమార‌స్వామి మాత్రం.. `ఈ క‌థ బాగోలేదు..` అంటూ ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. దాంతో పూరి ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విష‌యాన్ని కుమార స్వామినే స్వ‌యంగా వెళ్ల‌డించ‌డం విశేషం. పూరితో సినిమా చేద్దామ‌నుకొన్న మాట వాస్త‌వ‌మే. అయితే ఆయ‌న‌చెప్పిన క‌థ మాకు న‌చ్చ‌లేదు. అందుకే వ‌ద్దన్నాం అంటూ ఓ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి పూరి ప‌రువు తీసి పారేశాడు మాజీ సీఎమ్‌. పూరి ద‌గ్గ‌ర క‌థ‌ల స్టాకు అయిపోయింద‌ని చెప్ప‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com