Home

»

Latest News

ఇన్‌స్టాగ్రామ్‌లో `ఇస్మార్ట్ శంక‌ర్`

Jun 8, 2019 5:53PM

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైర‌క్ట‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్`. ఈ సినిమా త్వ‌ర‌లో  విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నీ సినిమాకు సంబంధించిన ఒక మాస్ సాంగ్ ను కూడా విడుద‌ల చేసారు. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంక‌ర్ స్టోరి ఇదంటూ `బ‌జ్ బాస్కెట్` అనే ఇన్ స్టాగ్రామ్ గ్రూపులో కృష్ణ అనే వ్య‌క్తి పోస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇన్ స్టా గ్రామ్ నుంచి తీసేయ‌డానికి భారీగా డ‌బ్బు డిమాండ్ చేయ‌డంతో నిర్మాత చార్మి హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ కూడా ప్రారంభించార‌ట‌.  రిలీజ్ కు ముందు సినిమా స్టోరి లీక‌వ‌డంతో చిత్ర యూనిట్ ఒక్క‌సారిగా షాకైంద‌ట‌. ఇక ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్, లిరిక‌ల్ వీడియోకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాతో మ‌ళ్లీ పూరి స‌క్సెస్ ట్రాక్ లో కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ట‌. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com