Home

»

Latest News

Priyanka Chopra: వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం!

Apr 25, 2026

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. తన అద్భుతమైన నటనతోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. 2026 గోల్డ్ గాలా (Gold Gala) వేడుకల్లో ప్రియాంక చోప్రాకు ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్ వాన్‌గార్డ్ గౌరవం' (Global Vanguard Honor) దక్కబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు వివిధ రంగాల్లో సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రతి ఏటా అందజేస్తారు. ఈ ఏడాది ప్రియాంక చోప్రాను ఈ అవార్డుకు ఎంపిక చేయడం వెనుక ఆమె సాధించిన అంతర్జాతీయ విజయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆమె సాగించిన ప్రయాణం, సామాజిక అంశాలపై ఆమె చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.

ప్రియాంక చోప్రా కేవలం నటిగానే కాకుండా ఒక నిర్మాతగా, వ్యాపారవేత్తగా, మానవతావాదిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యూనిసెఫ్ (UNICEF) గుడ్ విల్ అంబాసిడర్‌గా ఆమె చేస్తున్న సేవలు ప్రశంసనీయం.

సినీ రంగంలో ఆమె సాధించిన అసాధారణ విజయాలు, ప్రపంచవ్యాప్తంగా సామాజిక మార్పు కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.

ఈ గ్లోబల్ వాన్‌గార్డ్ గౌరవం అందుకోవడం ప్రియాంక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. మే నెలలో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ వేడుకలో ప్రపంచం నలుమూలల నుండి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 

కాగా, ప్రస్తుతం ప్రియాంక 'వారణాసి' (Varanasi) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com