Home

»

Latest News

నీ శరీరం,నీ ఇష్టమే: కానీ హద్దులు ఉండాలి.. టాప్ హీరోయిన్ కి ప్రియాంక చోప్రా తల్లి చురకలు

Aug 28, 2026 1:04PM

 

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్, రాజమౌళి ల 'వారణాసి'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బిజీ అనే కంటే ప్రియాంక చోప్రా చేరికతో 'వారణాసి'కి మరింత బలం చేకూరిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం కృతీ సనన్ రాఖీ యాడ్ వివాదం వైరల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై  ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్ మధు చోప్రా  ముంబైలో జరిగిన 'ఉమెన్ బిల్డింగ్ సినిమా టుగెదర్' లో మాట్లాడుతు 'నా శరీరం, నా ఇష్టం (My body, my choice) అనడం చాలా మంచిదే, కానీ ప్రతి దానికి ఒక హద్దు (దాయిరా) అనేది కచ్చితంగా ఉండాలి. ఇతరుల విలువలను, సంస్కృతిని గౌరవించడం చాలా ముఖ్యం. ఇలాంటి దుస్తులు ఎక్కడ పడితే అక్కడ, వాటికి తగిన చోట వేసుకుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మన సంస్కృతిలో, పండుగల సమయంలో ఇలాంటివి సాధారణం కావు. ఈ విషయంలో నేను కచ్చితంగా చెప్పగలను" అంటూ చెప్పుకొచ్చారు . తన కూతురు ప్రియాంక చోప్రా కూడా సినిమాల్లో, ఫ్యాషన్ షోలలో గ్లామరస్ దుస్తులు ధరిస్తుంటుంది కదా అని విలేకరులు అడిగినప్పుడు, "నా పిల్లలు కూడా పని కోసం, తమకు ఇష్టమైనందువల్ల అలాంటి బట్టలు వేసుకుంటారు. అందులో తప్పులేదు. కానీ ఏ బట్టలు వేసుకున్నా సందర్భానికి తగినట్లుగా, అందంగా (aesthetically) ఉండాలి. అలా లేనప్పుడు ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్షాబంధన్ లాంటి పవిత్రమైన పండుగ రోజున, సోదరుడికి రాఖీ కట్టే సమయంలో బికినీ లాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి అంటూ ఆమె ప్రశ్నించారు.


Also Read: రామ్ పోతినేని RAPO23 టైటిల్ లీక్.. ఫ్యాన్స్ లో జోష్

Priyanka Chopra,  Kriti Sanon, Madhu Chopra, TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood, Tollywood News

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com